News October 1, 2024
ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT
Similar News
News November 3, 2025
కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.
News November 3, 2025
చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.
News November 3, 2025
JEEలో కాలిక్యులేటర్‌ను అనుమతించం: NTA

IIT, NITలలో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్‌లో కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టం చేసింది. JEE-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌పై కాలిక్యులేటర్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిపై తాజాగా స్పష్టత ఇస్తూ టెస్టులో కాలిక్యులేటర్‌ను నిషేధించినట్లు తెలిపింది. బులెటిన్లో తప్పు దొర్లినందుకు విచారం వ్యక్తం చేస్తూ తాజా సవరణ నోట్‌ను వెబ్సైట్లో ఉంచింది.


