News October 1, 2024
రోడ్డు మధ్యలో దర్గా, గుడి, గురుద్వారా ఏదైనా కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు

బుల్డోజర్ యాక్షన్‌పై తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మనది సెక్యులర్ కంట్రీ. పబ్లిక్ రోడ్, ఫుట్‌పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్లో ఆక్రమణలు అన్నిటికీ మా ఆదేశాలు వర్తిస్తాయి. రోడ్డు మధ్యలో గుడి, గురుద్వారా, దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలున్నా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు’ అని వివరించింది.
Similar News
News February 27, 2026
విశ్రవసుడి గురించి మీకు తెలుసా?

విశ్రవసుడు గొప్ప వేద పండితుడు, తపశ్శాలి. పులస్త్యుని కుమారుడైన ఈయనకు అమిత శక్తి ఉంది. ఈయన మొదటి భార్య ఇలవిడ. వీరి సంతానమే కుబేరుడు. విశ్రవసుడి తపస్సుకు మెచ్చి సుమాలి తన కుమార్తె కైకసిని ఇచ్చి వివాహం చేశాడు. వీరి ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు. రావణుడు తన తండ్రి మాటను కాదని, కుబేరుడిని లంక నుంచి వెళ్లగొట్టడంతో విశ్రవసుడు తీవ్ర మనస్తాపానికి గురై వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
News February 27, 2026
గ్రామ పంచాయతీలకు శుభవార్త

AP: LRS, BPSల కింద వచ్చిన ఆదాయంలో మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకూ వాటా ఇవ్వాలని ప్రభుత్వం తొలిసారి నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. LRS కింద గ్రామాల్లో వచ్చే ఆదాయంలో పంచాయతీలకు 50%, పట్టణాభివృద్ధి, ప్రణాళికా విభాగాలకు 50% ఇవ్వనున్నారు. BPS కింద గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయంలో పంచాయతీలకు 70% ఇస్తారు.
* LRS: Layout Regularization Scheme
* BPS: Building Penalisation Scheme
News February 27, 2026
వార్నర్ బ్రదర్స్ డీల్ నుంచి తప్పుకున్న నెట్‌ఫ్లిక్స్

వార్నర్ బ్రదర్స్ స్టూడియో కొనుగోలు డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. దీంతో మరో బిడ్డర్ పారామౌంట్ స్కైడాన్స్‌కు లైన్ క్లియర్ అయింది. ఆ సంస్థ $111 బిలియన్లకు వార్నర్ బ్రదర్స్‌తో డీల్ కుదుర్చుకోనుంది. అంతకుముందు నెట్‌ఫ్లిక్స్ $82 బిలియన్లకు బిడ్ వేసింది. కానీ పారామౌంట్‌ను మించి తాము బిడ్ వేయలేమని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు 13శాతం వృద్ధి చెందడం గమనార్హం.


