News October 1, 2024
BIG BREAKING: లడ్డూ అంశంలో సిట్ దర్యాప్తు నిలిపివేత

AP: తిరుమల లడ్డూ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3న ధర్మాసనం ఆదేశాల తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేశారనడానికి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2026
VSR రీఎంట్రీ.. ఏ పార్టీలోకి?

AP: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు <<18928068>>విజయసాయి రెడ్డి<<>> ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంపై చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, తన మాజీ బాస్ వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన ఆయన టీడీపీ, వైసీపీలో చేరే ఆస్కారం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా ఉండే ఆయన బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. VSR ఏ పార్టీలో చేరతారని మీరు అనుకుంటున్నారు.
News January 22, 2026
లిక్కర్ స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డికే తెలుసు: విజయసాయి

AP: లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని EDకి చెప్పినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానన్నారు. మిథున్ సూచనతోనే అరబిందో నుంచి నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. సజ్జల శ్రీధర్, కసిరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ HYDలో ED ఆయన్ను 7 గంటలకు పైగా విచారించింది.
News January 22, 2026
ఆస్కార్-2026 నామినీల లిస్ట్ విడుదల

ఆస్కార్ రేసులో నిలిచిన నామినీ పేర్లను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పోటీ పడిన ‘హోమ్ బౌండ్’కి చోటు దక్కలేదు. ఈ విభాగంలో ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరాట్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) చోటు దక్కించుకున్నాయి. విభాగాల వారీగా లిస్ట్ కోసం పైన ఫొటోలు స్లైడ్ చేయండి.


