News October 1, 2024
పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ(M)లోని పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో గ్రామ సభ నిర్వహించి ప్రసంగిస్తారు.
Similar News
News December 27, 2025
పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై!

పుణేలో ఓ ప్రేమజంట విడాకులు నెట్టింట చర్చకు తెరలేపాయి. మ్యారేజ్ తర్వాత తాను మర్చంట్ నేవీలో డాక్టర్ అని భర్త చెప్పాడు. డ్యూటీకి వెళ్తే 6 నెలలు ఓడలోనే ఉండాల్సి వస్తుందని వివరించాడు. ఈ విషయం ముందే చెప్పాలి కదా అని భార్య నిలదీసింది. దీంతో వారు 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేశారు. ఏ విషయమైనా పెళ్లికి ముందే చర్చించుకోవాలని, ఇలాంటివి అసలు దాచొద్దని నెటిజన్స్ అంటున్నారు.
News December 27, 2025
‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <
News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.


