News October 1, 2024

రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.

Similar News

News October 1, 2024

ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయండి: మంత్రి అనగాని

image

AP: ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. CCLA ఆఫీసులో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలి. ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం 10 సార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నెలాఖరులోగా పూర్తి చేయాలి’ అని ఆదేశించారు.

News October 1, 2024

మారుతీ సుజుకీ అమ్మకాల్లో పెరుగుదల

image

సెప్టెంబరులో తమ కార్ల అమ్మకాలు పెరిగాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. మొత్తం 1,84,727 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువని పేర్కొంది. తాము అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్‌జీ వేరియంట్ అని వివరించింది. తొలిసారిగా సీఎన్‌జీ అమ్మకాలు 50వేల మార్కు దాటినట్లు స్పష్టం చేసింది. మరోవైపు హ్యుందాయ్ 64,201 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది.

News October 1, 2024

ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, గద్వాల్, కరీంనగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తోంది.