News October 1, 2024

GST వ‌సూళ్లు ₹1.73 ల‌క్ష‌ల కోట్లు

image

GST వ‌సూళ్లు సెప్టెంబ‌ర్‌లో ₹1.73 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి. గ‌త ఏడాది ఇదే నెల‌తో (₹1.63 లక్షల కోట్లు) పోలిస్తే 6.5% వృద్ధి న‌మోదైంది. అయితే, ఆగ‌స్టు నెల జీఎస్టీ వ‌సూళ్లు ₹1.75 లక్షల కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌లో కలెక్షన్లు కొంత‌మేర త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. FY25 First-Halfలో GST వసూళ్లు రూ.10.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది FY24 First-Half కంటే 9.5 శాతం అధికం కావడం గమనార్హం.

Similar News

News October 2, 2024

ఇరాన్ క్షిపణులను డిఫెండ్ చేయాలని బైడెన్ ఆదేశం

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ <<14246742>>దాడి<<>> నేపథ్యంలో అక్కడి పరిస్థితులను యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు సహాయం చేయాలని, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కాల్చివేయాలని బైడెన్ US మిలిటరీని ఆదేశించారు. కాగా ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.

News October 2, 2024

కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు

image

ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్‌ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.

News October 2, 2024

దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్ర‌క‌టించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్ర‌క‌ట‌నలు జారీ చేసింది.