News October 1, 2024
సొత్తు తిరిగిస్తే దొంగతనం క్షమార్హమా?: బీజేపీ

ముడా కేసులో భూములను తిరిగి అప్పగించేస్తానని సీఎం సిద్ద రామయ్య సతీమణి చేసిన ప్రకటనపై బీజేపీ సెటైర్లు వేసింది. చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చేస్తే దొంగ అమాయకుడు అయిపోతాడా? అంటూ సీఎంను ప్రశ్నించింది. భూములను తిరిగిచ్చేయడం ద్వారా కొన్ని తప్పులు జరిగాయన్న విషయాన్ని సీఎం అంగీకరిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్.అశోక దుయ్యబట్టారు. సొత్తు తిరిగిచ్చేస్తే చోరీ క్షమార్హం అవుతుందా? అంటూ ఆయన ప్రశ్నించారు.
Similar News
News September 19, 2025
నేడు ఒమన్‌తో భారత్ మ్యాచ్

ఆసియా కప్‌లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్‌తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.
News September 19, 2025
రాబోయే 4 రోజులు వర్షాలు

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.