News October 1, 2024

AP టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

☞ అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజూ 2 సెషన్లలో పరీక్షలు
☞ పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు
☞ అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి
☞ ఒకటి కన్నా ఎక్కువ హాల్‌టికెట్లు పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి
☞ హాల్ టికెట్‌పై ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా 2 పాస్‌పోర్టు ఫొటోలను డిపార్ట్‌మెంటల్ అధికారికి సమర్పించాలి
☞ దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయం

Similar News

News October 12, 2024

విమాన ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ

image

తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్‌తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

News October 12, 2024

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు పర్వానికి చేరాయి. ఆఖరి రోజైన ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దీంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

News October 12, 2024

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్

image

TG: రాష్ట్ర సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున కుటుంబ సభ్యులు ఒకచోట చేరి సంబురాలు చేసుకోవడం ఐక్యతకు నిదర్శమన్నారు. చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవిత సత్యాన్ని విజయ దశమి తెలియజేస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.