News October 1, 2024
తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకుంటాం: స్టీల్ ప్లాంట్ అధికారులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ED ఆఫీస్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ధర్నాకి యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బయోమెట్రిక్ గేట్ పాసులు యథావిధిగా కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంగళవారం రాత్రి హామి ఇచ్చింది. లిఖిత పూర్వకంగా తమకు హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు వెల్లడించారు.
Similar News
News January 10, 2026
కేంద్రమంత్రి సురేష్ గోపికి స్వాగతం పలికిన జీవీఎల్

కేంద్రమంత్రి, సినీ నటుడు సురేష్ గోపి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు స్వాగతం పలికారు. కేంద్రమంత్రి బీచ్ రోడ్డులోని లైట్ హౌస్ ఫెస్టివల్‌లో, అనంతరం ఏయూ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్ మహా సంక్రాంతి’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పెట్రోలియం, పర్యాటక రంగాలపై ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.
News January 10, 2026
విశాఖ జూ పార్క్‌లో స్వాన్, ఈము పిల్లల పునరుత్పత్తి

విశాఖ జూ పార్కులో కొన్ని వారాలుగా స్వాన్, ఈము గుడ్లను కృత్రిమంగా ఇంక్యూబేటర్‌లో పెట్టారు. శనివారం ఈ గుడ్ల నుంచి 6 ఈము పిల్లలు, ఒక బ్లాక్ స్వాన్ పిల్ల వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. అంతేకాకుండా రెండు సాంబార్ జింకలు, రెండు నీలిగాయి, మూడు బ్లాక్ బక్స్ కూడా జన్మించినట్లు చెప్పారు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
News January 10, 2026
పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.


