News October 2, 2024
TODAY HEADLINES
* ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ దాడి
* రాష్ట్రాలకు కేంద్ర వరద సాయం విడుదల
* AP:వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం: చంద్రబాబు
* AP:కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్
* AP:రాష్ట్రంలో మూతపడిన మద్యం దుకాణాలు
* రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
* TG:హైదరాబాద్‌లో డీజే వినియోగంపై నిషేధం
* TG:ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
* సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఆపరేషన్
* BANపై భారత్ సంచలన విజయం
Similar News
News December 30, 2024
కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు
టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.
News December 30, 2024
vitamin D దొరికే ఫుడ్స్ ఇవే
ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
News December 30, 2024
సిఫారసు లేఖల వ్యవహారం: రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.