News October 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 13, 2026

తుర్కియే, పాకిస్థాన్, సౌదీ.. ‘ఇస్లామిక్ నాటో’ కూటమి?

image

పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి ‘ఇస్లామిక్ నాటో’ అనే రక్షణ కూటమి ఏర్పాటు చేసేందుకు తుర్కియే ప్లాన్ చేస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే 350 డ్రోన్లు ఇచ్చి పాక్‌కు సపోర్ట్ చేసింది. మరోవైపు గతేడాది పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు డిఫెన్స్ పరంగా తలనొప్పేనని విశ్లేషకులు చెబుతున్నారు.

News January 13, 2026

సంక్రాంతి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

image

TG: తెలుగు ప్రజలకు CM రేవంత్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్-2047 విజన్​ సాకారం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.

News January 13, 2026

రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

image

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.