News October 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:04 గంటలకు
ఇష: రాత్రి 7.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News September 20, 2025

బొప్పాయిలో మొజాయిక్ వైరస్ లక్షణాలు

image

బొప్పాయి తోటల్లో మొజాయిక్ వైరస్ విత్తనం, పేను ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పూర్తిగా ఆకు పసుపు రంగుకు మారుతుంది. అందుకే దీనిని పల్లాకు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు ముడుచుకుపోయి పెళుసుగా మారతాయి. మొక్కలు సరిగా ఎదగవు. బలహీనంగా కనిపిస్తాయి. కాయల్లో నాణ్యత ఉండదు. పండ్లు చిన్నవిగా, వికృతంగా తయారవుతాయి.

News September 20, 2025

బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

News September 20, 2025

మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

image

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.