News October 2, 2024

విశాఖ: హైకోర్టు ఆదేశాలతో రేషన్ డిపోల పునర్విభజనకు బ్రేక్

image

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల పునర్విభజనకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. జిల్లాలో రేషన్ షాపుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను రద్దు చేయాలని రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం తెలిపారు.

Similar News

News March 4, 2026

విశాఖ: రైలు ప్రయాణికులకు అలెర్ట్

image

వాల్తేర్ డివిజన్‌లోని శిలిమ్లిగూడ-కరకవలస మధ్య డబుల్ లైన్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ మధ్య నడిచే (58501, 58502) ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు ఈ రద్దు వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

image

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.