News October 2, 2024
NZB: బస్సు పైన ప్రమాదకరంగా ప్రయాణం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు రావడంతో మంగళవారం బస్‌స్టాండ్‌లు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారడంతో కొందరు ప్రమాదకరంగా బస్సు మీదకు ఎక్కి ప్రయాణించారు. కాగా పండుగ నేపథ్యంలో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News December 25, 2025
ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.
News December 24, 2025
NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.