News October 2, 2024

ప్రకాశం: 97.02 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పెన్షన్ల పంపిణీ విజయవంతంగా అధికారులు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,88,144 మందికి గాను 2,79,365 మందికి పింఛన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. మొత్తం 97.02 శాతం పంపిణీ చేసినట్లు వివరించారు. మిగతా పింఛన్లు గురువారం పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Similar News

News October 2, 2024

ప్రకాశం వస్తున్నారా.. అయితే ఇవి చూసేయండి.!

image

దసరా సెలవుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. అయితే ఈ పర్యాటక ప్రదేశాలను మిస్ కావద్దు. జిల్లాలో భైరవకోన, కొత్తపట్నం, రామాయపట్నం, పాకల బీచ్‌లు, వల్లూరమ్మ తల్లి ఆలయం, కంభం చెరువు, మాలకొండ స్వామి ఆలయం, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. దసరా సెలవులు అనగానే మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయండి.

News October 2, 2024

ప్రకాశం జిల్లాలో దసరాకు 136 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

image

దసరా సందర్భంగా ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యార్థం 136 సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి బి సుధాకరరావు తెలిపారు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు అన్ని డిపోల నుంచి 136 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రానుపోను ఒకేసారి టికెట్‌ రిజర్వు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.

News October 1, 2024

ఒంగోలు: పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్

image

ఒంగోలులో నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి పెన్షన్ దారుడికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.