News October 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా మంగళవారం 63,300 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.4.23 కోట్లు నిన్న హుండీ రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 30, 2026

కుప్పానికి 2 గంటలు ఆలస్యంగా రానున్న CM

image

CM చంద్రబాబు కుప్పం పర్యటన రెండు గంటలు ఆలస్యంగా మొదలుకానుంది. CM గుంటూరులో పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2.35 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే గుంటూరులో పర్యటన ఆలస్యం కావడంతో పర్యటన రెండు గంటలకు ఆలస్యంగా మొదలుకానుంది.

News January 30, 2026

ఎవరికీ ప్రాణాపాయం లేదు: చిత్తూరు కలెక్టర్

image

SRపురం బీసీ కాలనీలో స్కూల్ <<18999092>>బస్సును లారీ ఢీకొట్టిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం రాణిపేట సీఎంసీకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు.

News January 30, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరంగా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఏవీఆర్ మూర్తి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగా తమ శాఖ పరంగా సమస్యలుంటే ఫోన్ చేసి చెప్పాలని కోరారు.