News October 2, 2024

కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్

image

రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.

Similar News

News March 11, 2025

NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

image

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News March 11, 2025

నిజామాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

image

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని అంబం(వై) గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. అంబం(వై) గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న(55) గ్రామ శివారులోని పెద్దవాగులో సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. 

News March 11, 2025

NZB: గీతకార్మికుడిపై ఎలుగుబంటి దాడి

image

గీత కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో జరిగింది.  కలిగోట్ కోరట్ పల్లి సరిహద్దులో గల వాగులో మెతుకు రాములు అనే గీత కార్మికుడు ఈతచెట్ల వద్దకు కల్లు తేవడానికి వెళ్లగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. అతని చేతికి స్వల్పగాయమైంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

error: Content is protected !!