News October 2, 2024
బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

బోధన్ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.