News October 2, 2024

పేపర్ కొనుగోలుకు వాలంటీర్లకిచ్చే నగదు నిలిపివేత

image

AP: న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు చెల్లిస్తున్న రూ.200 నగదును ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల పేపర్‌ కొనుగోలుకు నగదు సాయం నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దినపత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది. సాక్షి పేపర్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని TDP ఆరోపించింది.

Similar News

News December 21, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.

News December 21, 2024

అల్లు అర్జున్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

News December 21, 2024

NTRతో మూవీ తర్వాతే KGF-3, సలార్-2: హొంబలే

image

హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF విడుదలై నేటికి ఆరేళ్లు, సలార్‌‌కు రేపటితో ఏడాది పూర్తవుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాల్లో నటించిన యశ్, ప్రభాస్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం NTRతో తీసే సినిమాలో నీల్ బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాతే ఆయన KGF-3, సలార్-2 ప్రాజెక్టులు చేస్తారని వెల్లడించారు.