News October 2, 2024

మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

image

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

Similar News

News October 2, 2024

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం: సురేఖ

image

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.

News October 2, 2024

ICC నం.1 టెస్టు బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. 870 పాయింట్స్‌తో బుమ్రా నం.1 టెస్టు బౌలర్‌గా నిలిచారు. ఇప్పటివరకు నం.1గా ఉన్న అశ్విన్ రెండో స్థానానికి పడిపోయారు. అశ్విన్ కూడా బంగ్లాతో టెస్టు సిరీస్‌లో 11 వికెట్లు తీయడం గమనార్హం.

News October 2, 2024

విజయ్ లాస్ట్ మూవీ.. ‘భగవంత్ కేసరి’ రీమేక్?

image

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్ తన చివరి చిత్రం ‘దళపతి 69’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రమైతే సేఫ్ సైడ్ అని విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనేమీ రాలేదు.