News October 2, 2024

మెసేజులకు ఇబ్బందేం రాలేదు

image

OCT 1 నుంచి అమల్లోకి వచ్చిన TRAI <<13981589>>వైట్‌లిస్టింగ్<<>> రూల్స్‌తో తొలిరోజు ఎలాంటి అవాంతరాలు కలగలేదు. బ్యాంకులు, ఇతర సంస్థలు పంపిన కమర్షియల్ మెసేజులు సరిగ్గానే వెళ్లాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ URLsను వైట్‌లిస్ట్ చేయకపోవడంతో 15-20% ట్రాఫిక్ తగ్గినట్టు అధికారులు తెలిపారు. టెలికం ఆపరేటర్లు బ్లాక్ చేస్తారు కాబట్టి వారు మెసేజులను పంపలేదని చెప్పారు. త్వరలోనే వారూ వైట్‌లిస్ట్ చేస్తారని వెల్లడించారు.

Similar News

News November 7, 2025

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

News November 7, 2025

₹1,01,899 CR పెట్టుబడులకు CBN ఆమోదం

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చూడడంతో పాటు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. భూమి, ఇతర రాయితీలు పొందిన వాటిని సమీక్షించి పురోగతి లేకుంటే రద్దు చేయాలని SIPB భేటీలో స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును ఏర్పాటుచేయాలని సూచించారు. కాగా భేటీలో ₹1,01,899 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు.

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59 సమాధానాలు

image

1. అర్జునుడి శంఖం పేరు ‘దేవదత్తం’.
2. రుక్మిణి సోదరుడు ‘రుక్మి’.
3. అట్ల తద్ది పండుగ ‘ఆశ్వయుజ మాసం’లో వస్తుంది.
4. సుమంత్రుడు ‘దశరథుడి’ రథసారథి. రాముడి రథసారథిగా కూడా ఉన్నాడని కొందరు నమ్ముతారు.
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ‘కళ్యాణ కట్ట’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>