News October 2, 2024
డెన్మార్క్‌లో పేలుళ్ల కలకలం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి మరువకముందే డెన్మార్క్ రాజధాని కోపెన్ హేగెన్‌లో పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడి ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో వెంట వెంటనే రెండు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 19, 2026
చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.
News January 19, 2026
5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.
News January 19, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గువాహటిలోని <


