News October 2, 2024
GOOD NEWS.. జీతాల పెంపుపై ప్రకటన

TG: 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ ఉద్యోగులకు డిస్కమ్‌లు భారీగా జీతాలు పెంచనున్నాయి. 20శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తామని ప్రకటించాయి. 2022లో వేతన సవరణ జరగ్గా 7శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాయి. గత పదేళ్లలో మూడు సార్లు వేతన సవరణ జరగ్గా వేతనాలు 180శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖర్చు ఏటా 7శాతం పెరుగుతుండటంపై ERC వివరణ కోరగా, డిస్కంలు ఈ మేరకు ప్రకటించాయి.
Similar News
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
News January 25, 2026
సూర్యుడు దేవుడా..?

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.
News January 25, 2026
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.


