News October 2, 2024
వివాదంలో ‘యానిమల్’ హీరోయిన్
యానిమల్ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తృప్తి దిమ్రి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు వస్తానని తృప్తి రూ.5.5 లక్షలు తీసుకున్నారని సమాచారం. నిన్న ఈవెంట్‌కు ఆమె రాకపోవడంతో మోసం చేశారంటూ నిర్వాహకులు ఆమె ఫొటోపై పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 30, 2024
Good News: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన Lenacapavirకు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఏడాదికి 2సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.
News December 30, 2024
ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..
HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.
News December 30, 2024
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి
APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.