News October 2, 2024

సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

image

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.

Similar News

News October 2, 2024

12 నిమిషాల్లోనే 2,000 కి.మీ: ఇరాన్ స్పెషల్ మిస్సైల్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్-2 మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2,000 కి.మీ దూరాన ఉన్న టార్గెట్‌ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్‌కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కి.మీ దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపొదిలో ఉంది.

News October 2, 2024

వివాదంపై స్పందించిన త్రిప్తి దిమ్రీ

image

డబ్బు తీసుకొని ఈవెంట్‌కు గైర్హాజరయ్యారంటూ తనపై వస్తున్న <<14249459>>ఆరోపణలపై<<>> బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ స్పందించారు. జైపూర్‌లో తాను ఏ ఈవెంట్‌ మిస్ కాలేదని, అసలు తాను డబ్బే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ త్రిప్తి టీమ్ ఈమేరకు ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ మూవీ ప్రమోషన్స్‌ కోసం అన్ని ఈవెంట్లకు హాజరవుతున్నట్లు పేర్కొంది.

News October 2, 2024

మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.