News October 2, 2024

ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు

image

యూపీ వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో నిన్న బాబా విగ్రహాలను తొలగించి, ఆలయాల బయట పెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మ గురువే కావొచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు అభిప్రాయపడ్డారు.

Similar News

News October 2, 2024

మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.

News October 2, 2024

గాజాతో CEASE FIRE ఔట్ ఆఫ్ క్వశ్చన్: డిఫెన్స్ ఎక్స్‌పర్ట్

image

వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ యోసి కుపర్‌వాసర్ అన్నారు. ఈ టైమ్‌లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్‌పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్‌ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.

News October 2, 2024

రైల్వేట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

image

ఝార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్‌పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.