News October 2, 2024
HYD: బాపుఘాట్‌లో గవర్నర్ నివాళులు

సత్యం, అహింస, ప్రేమ, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడి ప్రజలు మహాత్మా గాంధీ కలలు కన్న భారతం సాకారం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు.
Similar News
News March 7, 2026
HYDకు చేరువలో అద్భుతమైన అందాలు.. వెళ్దామా?

HYD నగరానికి చేరువలో నల్లమల అడవుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ‘మన్ననూర్ జంగిల్ రిసార్ట్’లో పులుల సఫారీ, పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్థానిక చెంచులతో కలిసి అడవి రహస్యాలను తెలుసుకునే వీలుంది. ఆధునిక వసతులు, భోజన సౌకర్యాలతో కూడిన ఈ పర్యాటక ప్యాకేజీ కోసం <
News March 6, 2026
HYD: సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.
News March 6, 2026
గచ్చిబౌలి: గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలు

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్ బెలూన్ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


