News October 2, 2024
రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారు: కేటీఆర్

TG: రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో విమర్శించారు.
Similar News
News November 5, 2025
ఐఐటీ గాంధీనగర్ 36 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 5, 2025
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.
News November 5, 2025
హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్‌సైట్: https://hansrajcollege.ac.in/


