News October 2, 2024
ఈ నెల 10న సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 10న సెలవు ఉండనుంది.
Similar News
News February 17, 2026
మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చూసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరిలో జరిగే మరో కార్యక్రమానికి వెళ్తుండగా ఎయిమ్స్ సమీపంలో బైకులు ఢీకొని ఓ యువతి, వ్యక్తి గాయపడటాన్ని గమనించారు. మంత్రి వెంటనే తన వాహనం నుంచి దిగి క్షతగాత్రులకు సపర్యలు చేసి పరామర్శించారు. అనంతరం అంబులెన్సులో ఎయిమ్స్‌కి పంపించారు.
News February 17, 2026
పంచాయతీలకు రూ.250 కోట్లు

TG: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.387 కోట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News February 17, 2026
మళ్లీ పెళ్లికి సిద్ధం: మమతా మోహన్ దాస్

మరోసారి ప్రేమలో పడేందుకు, పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని హీరోయిన్ మమతా మోహన్‌దాస్ వెల్లడించారు. అందుకు తగిన వ్యక్తి దొరకాలని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2011లో బిజినెస్‌మ్యాన్ ప్రేజిత్‌తో ఆమె వివాహం జరగగా ఏడాదికే విడిపోయారు. ‘ప్రేజిత్‌ను ఓ పెళ్లిలో మళ్లీ కలిశా. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా అనిపించాయి. మళ్లీ మనం పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అడిగాడు. వెళ్లి మా నాన్నతో మాట్లాడమని చెప్పా’ అని తెలిపారు.


