News October 2, 2024
12 నిమిషాల్లోనే 2,000 కి.మీ: ఇరాన్ స్పెషల్ మిస్సైల్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్-2 మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2,000 కి.మీ దూరాన ఉన్న టార్గెట్‌ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్‌కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కి.మీ దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపొదిలో ఉంది.
Similar News
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.


