News October 2, 2024
పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచనలు

AP: పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను మీ ప్రతినిధిని మాత్రమే. కష్టపడి పనిచేసి, నష్టపోయినవారికి అండగా ఉంటాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా YCPని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పార్టీ పిలుపునిస్తే పైస్థాయి నుంచి కిందివరకు అంతా కదలిరావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి’ అని సూచించారు.
Similar News
News December 30, 2025
హైదరాబాద్‌లో కొత్త కమిషనరేట్లు.. ఐపీఎస్‌ల బదిలీలు

HYDలో కమిషనరేట్లను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ(రాచకొండ స్థానంలో), మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. దీంతో పలువురు IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. HYD ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు(ఫొటోలో), మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా ఎం.రమేశ్, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించింది.
News December 29, 2025
PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.
News December 29, 2025
నవీన్ యాదవ్ ఎన్నిక రద్దు చేయాలి: హైకోర్టులో సునీత పిటిషన్

TG: జూబ్లీహిల్స్ MLAగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలు తక్కువగా చూపారని ఆరోపించారు. ప్రచారంలో కూడా రూల్స్ ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, సునీత దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్‌లో ఉంది.


