News October 2, 2024
CRPFపై దాడికి దీపావళి టపాసులు వాడుతున్న మావోయిస్టులు

సెక్యూరిటీ ఫోర్సెస్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు మావోయిస్టులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గ్రెనేడ్లు, IED, గన్స్‌తో దాడి చేసే ముందు CRPF క్యాంపుల సమీపంలో అగరబత్తీలు, దీపావళి టపాసులు పేల్చుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వాటి సౌండ్, పొగకు క్యాంప్ నుంచి పోలీసులు బయటకు రాగానే నక్సలైట్లు అటాక్ చేస్తున్నారని పేర్కొన్నాయి. SEP 25న TG కొత్తగూడెం అడవుల్లో ఈ వ్యూహాన్ని గుర్తించామని వెల్లడించాయి.
Similar News
News September 19, 2025
సంగీత రంగంలో జుబీన్ సేవలు అనిర్వచనీయం: PM మోదీ

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ <<17761932>>మరణంపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంగీత రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. తన పాటలతో అన్ని వర్గాల ప్రజలను అలరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి జుబీన్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి ఉంటారని ట్వీట్ చేశారు.
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: ఈడీ సోదాల్లో రూ.38లక్షలు స్వాధీనం

AP: లిక్కర్ స్కాం కేసులో దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో <<17748928>>2వ రోజు<<>> ED సోదాలు నిర్వహించింది. HYD, బెంగళూరు, చెన్నై, తంజావూరులో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని రూ.38లక్షలు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ ఖజానాకు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లిందని.. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని FIRలో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
News September 19, 2025
నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.