News October 2, 2024

లక్ష కోట్ల డాలర్ల వైపు భారత డిజిటల్ ఎకానమీ

image

2028 నాటికి భారత డిజిటల్ ఎకానమీ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆస్క్ క్యాపిటల్ రిపోర్టు తెలిపింది. ప్రభుత్వ డిజిటల్ స్కీములు, పెరిగిన ఇంటర్నెట్ వినియోగం, చీప్ 4G, 5G వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. UPI వంటి రియల్‌టైమ్ పేమెంట్స్ టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంట్‌లో గేమ్ ఛేంజర్‌ అన్న సంగతి తెలిసిందే. ICRIER ప్రకారం డిజిటలైజేషన్లో జపాన్, UK, జర్మనీ కన్నా భారత్ మెరుగైన స్కోర్ సాధించింది.

Similar News

News October 11, 2024

స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి

image

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

News October 11, 2024

మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

image

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.