News October 3, 2024
వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు: చైతూ

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగచైతన్య తప్పుబట్టారు. ‘విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం. నా మాజీ భార్య, నా కుటుంబం కోసమే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను. ఈరోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాస్యాస్పదం, ఆమోదయోగ్యం కానివి. మహిళకు మద్దతిస్తూ గౌరవించాలి. వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు’ అని అన్నారు.
Similar News
News March 10, 2026
IPL షెడ్యూల్‌పై అప్‌డేట్

IPL-2026 షెడ్యూల్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 12న బీసీసీఐ సెక్రటరీ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు IANS వెల్లడించింది. తొలుత 20 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేస్తారని పేర్కొంది. కాగా మార్చి 28 నుంచి ఈ మెగా క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు దశల్లో లీగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
News March 10, 2026
చమురు సంక్షోభం.. చైనా ఎందుకు భయపడట్లేదు?

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్నా ఇరాన్ నుంచి 90% ఆయిల్‌ను కొనే చైనా మాత్రం పెద్దగా ఆందోళన చెందట్లేదు. దీనికి కారణం ఆ దేశం నిల్వ చేసుకున్న 1.4 బిలియన్ బ్యారెళ్ల అత్యవసర నిల్వలే. అలాగే చైనాలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల చమురుపై ఆధారపడటం తగ్గింది. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో సరఫరా నిలిచినా రష్యా నుంచి దిగుమతులు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో చైనా ఈ చమురు సంక్షోభాన్ని తట్టుకోగల ధీమాతో ఉంది.
News March 10, 2026
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు నిపుణులు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో దంత సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు సూచిస్తారని చెబుతున్నారు.


