News October 3, 2024
గాంధీ జయంతి సందర్భంగా వికలాంగులకు స్కూటీల పంపిణీ

మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో వికలాంగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూటీలు పంపిణీ చేశారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వికలాంగులై ఉండి రానివారికి మరొక విడుతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ చైర్మన్ ఆకుల లలిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
KNR: రోడ్డు భద్రతే లక్ష్యం: సీపీ గౌష్ ఆలం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లాలో ‘ARRIVE – ALIVE’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న ‘నో ఫైన్ డే’ నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
News April 10, 2026
కరీంనగర్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్

కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు (ఒక మహిళ, ఇద్దరు పురుషులు) మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేయనున్నారు. కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించాలి.
News April 10, 2026
KNR: పాడిపశువుల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల16 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO/ మునిసిపల్ కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.


