News October 3, 2024

అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

image

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం
1954: నటుడు సత్యరాజ్ జననం
1978: భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం

Similar News

News October 3, 2024

నేటి నుంచి AP TET

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.

News October 3, 2024

మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి కుష్బూ

image

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.

News October 3, 2024

నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR

image

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.