News October 3, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.74

image

టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్‌కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

Similar News

News March 5, 2026

బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

image

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.

News March 5, 2026

తాడిపత్రిలో రైలు పట్టాలపై పడుకుని..!

image

తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి గురువారం హల్‌చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.

News March 5, 2026

అనంత: పక్కాగా జనగణన

image

అనంతపురం జిల్లాలో 16వ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. డేటా సేకరణలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.