News October 3, 2024

సీఎం రేవంత్‌పై ఆరోపణలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై TPCC మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానంపై KTR తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ₹1,50,000 కోట్లను ప్రకటించారని, ఇందులో ₹25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టేందుకేనని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 3, 2026

‘రామాయణ’ యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

‘రామాయణ’ <<19543549>>సినిమా<<>> రెండు పార్టులకు కలిపి రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ రూ.150కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రావణుడిగా కనిపించనున్న యశ్ రూ.100కోట్లు, సాయి పల్లవి (సీత) రూ.12కోట్లు, సన్నీ డియోల్(హనుమంతుడు) రూ.40కోట్లు, రవి దూబే (లక్ష్మణుడు) రూ.2-4కోట్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

News April 3, 2026

ఏప్రిల్ రెండో వారంలో రైతు భరోసా రెండో విడత?

image

TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.2,650 కోట్లు అవసరమని తేల్చారు. ఈ నిధులను రెడీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో సోమవారంలోగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయనుంది. రెండో విడతలో ఎకరానికి మించి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

News April 3, 2026

కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు

image

కువైట్, UAE లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. తమ డీసాలినేషన్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీపై అటాక్ జరిగినట్లు కువైట్ అధికారులు ధ్రువీకరించారు. మినా అల్ అహ్మదీ రిఫైనరీలోని కొన్ని యూనిట్లు మంటల్లో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తమ దేశంపై మిస్సైల్స్, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిందని UAE తెలిపింది. తాము అడ్డుకున్న మిస్సైల్ శకలాలు పడి హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీలో మంటలు చెలరేగాయని చెప్పింది.