News October 3, 2024
KKD: ఆ కసాయి తండ్రి దారుణాలెన్నో..?

కాకినాడ జగన్నాథపురం చెక్కావారి వీధిలో పండ్ల వ్యాపారి శివమణి తన బిడ్డను <<14248309>>చంపేసిన<<>> విషయం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన అతను తన మగబిడ్డను వైజాగ్‌లో అమ్మేశాడు. భర్త చనిపోయి నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయగా ఆడబిడ్డ పుట్టింది. ఆబిడ్డను అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనకపోవడంతో కోపంతో చిన్నారిని గోడకేసి కొట్టి హతమార్చాడు. నిందితుడిని వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావు అరెస్ట్ చేశారు.
Similar News
News August 21, 2025
భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్ తనిఖీ

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.