News October 3, 2024
విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు(సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 25, 2026
కృష్ణా: రిపబ్లిక్ డే రిహార్సల్స్ పరిశీలించిన ఎస్పీ

రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిహార్సల్స్‌ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. ఏఆర్ పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. సోమవారం జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో చక్కటి కవాతు ప్రదర్శించాలని ఏఆర్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయక్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
News January 24, 2026
కృష్ణా: ద్విచక్ర వాహనదారులకు కలెక్టర్ సూచనలు

కలెక్టర్ డీకే బాలజీ శనివారం ఉదయం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వయంగా తనిఖీలు చేపట్టిన ఆయన, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాల కంటే ముందు ప్రాణ రక్షణ పట్ల అవగాహన కల్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ఆయన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు అందజేశారు.
News January 24, 2026
26న జరిగే పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్న PGRSను రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తెలిపారు. అధికారులంతా ఆ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు చెప్పారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించే PGRSను కూడా రద్దు చేసినట్లు SP విద్యాసాగర్ వెల్లడించారు.


