News October 3, 2024
ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్

ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News January 20, 2026
కందుకూరు: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

కందుకూరు కానిస్టేబుల్ సాజిద్ విషమ పరిస్థితి అందరి మనసులను కలచివేస్తోంది. తల్లిని అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా బైక్‌పై ఫాలో అవుతున్న సాజిద్ <<18904402>>ప్రమాదానికి <<>>గురై ప్రాణాపాయస్థితిలో ఒంగోలులో చికిత్స పొందుతున్నాడు. ఈలోగా ఆయన తల్లి కన్నుమూశారు. కోమాలో ఉన్న సాజిద్‌కు అది తెలియదు. తల్లి అంత్యక్రియలు కూడా చూడలేని సాజిద్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆయన తండ్రి ఓ టైలర్.
News January 20, 2026
ప్రకాశం జిల్లాలో మద్యం లైసెన్స్‌కు దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగినవారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 20, 2026
ప్రకాశం: 22 గ్రామాలను పట్టి పీడిస్తున్న సమస్య.!

పొన్నలూరు మండలంలోని 22 గ్రామాల సమస్య ఇది. కరోనా కష్టకాలంలో యూజర్లను తమవైపు తిప్పుకున్న నెట్‌వర్క్‌లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ప్రధానంగా K.అగ్రహారంలో కొద్దిరోజులక్రితం సెల్ టవర్లు తీసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతవాసుల పరిస్థితి అడవుల్లో జీవిస్తున్నట్లే ఉంది. దీంతో సచివాలయ, బ్యాంక్ సేవలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో BSNL టవర్ నిరుపయోగంగా ఉండగా.. సంబంధిత అధికారులు స్పందించాలని యూజర్లు కోరారు.


