News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.

Similar News

News October 3, 2024

కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్

image

మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, BRS రాజకీయాలు చేస్తున్నాయని CM రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. ఫాంహౌస్‌లు కూల్చుతామనే భయంతో పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.

News October 3, 2024

ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి

image

TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.

News October 3, 2024

సద్గురుకు రిలీఫ్: TN పోలీస్ యాక్షన్ అడ్డుకున్న సుప్రీంకోర్టు

image

మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌పై TN పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది. HCPని హైకోర్టు నుంచి బదిలీ చేసుకుంది. చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను OCT 18కి వాయిదా వేసింది. 5వేల మంది ఉండే ఆశ్రమంలోకి 150+ పోలీసులు వెళ్లారని ఈషా లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ‘అవును, అలాంటి చోటకు అలా వెళ్లకూడదు’ అని CJI ఏకీభవించారు.