News October 3, 2024

100 మంది శిశువులకు ‘నస్రల్లా’ పేరు!

image

ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాక్‌లో పుట్టిన 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే ఆయనకు ఘన నివాళి అని పేర్కొంది. ఇరాక్‌లో ఎక్కువగా ఉండే షియా కమ్యూనిటీ ప్రజల్లో నస్రల్లాకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మరోవైపు నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తూ ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.

Similar News

News November 14, 2025

CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

image

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.

News November 14, 2025

బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు: మోదీ

image

బిహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘బిహార్‌లో NDA సాధించింది అతి పెద్ద విజయం. రికార్డుస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనాలని నేను ఓటర్లను కోరాను. వాళ్లు రికార్డులు బద్దలుకొట్టారు. మేం ప్రజలకు సేవకులం. వారి మనసులు గెలుచుకున్నాం. బిహార్‌లో ఆటవిక రాజ్యం ఎప్పటికీ తిరిగిరాదు. కొందరు MY ఫార్ములాతో గెలవాలని చూశారు. మా ‘MY’ ఫార్ములా అంటే మహిళ, యూత్ ఫార్ములా’ అని తెలిపారు.

News November 14, 2025

60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.