News October 3, 2024

Stock Markets Crash: రూ.3 లక్షల కోట్లు ఆవిరి

image

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. అనిశ్చితి నెలకొనడం, సప్లై చైన్ అవాంతరాలు, క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల భారీగా క్రాష్ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ 725 పాయింట్ల నష్టంతో 83,542, NSE నిఫ్టీ 218 పాయింట్లు ఎరుపెక్కి 25,578 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. నిఫ్టీలో 41 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్.

Similar News

News February 7, 2026

T20 WC.. నేటి మ్యాచ్‌కు బుమ్రా దూరం!

image

T20 WCలో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరిగే <<19072262>>తొలి మ్యాచ్‌<<>>కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. నిన్న ఆయన గ్రౌండ్‌కు వచ్చినా ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు సుందర్ ఇంకా ఫిట్ కాకపోవడంతో భారత స్క్వాడ్‌లో 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.

News February 7, 2026

‘వందేభారత్’లో పేలుళ్లకు ప్లాన్.. కలకలం రేపిన లేఖ

image

TG: వందే భారత్ రైళ్లను పేల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఓ ఆగంతకుడు రైల్వే అధికారులకు లేఖ రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HYDలో ఉంటున్న నలుగురు జిహాదీలు వందేభారత్ ట్రైన్స్‌లో దాడులకు ప్లాన్ చేశారని అతను లేఖలో పేర్కొన్నాడు. దాదాపు 250 మందిని చంపాలని చూస్తున్నట్లు తెలిపాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ లేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 7, 2026

పాక్ యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

image

T20 WCలో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19024958>>పాకిస్థాన్ నిర్ణయం<<>> మార్చుకోవచ్చని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘టోర్నీ గ్రూప్ దశలో మనకు ఎలాంటి సవాళ్లు లేవు. ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ విషయంలో ఏ క్షణమైనా పాక్ యూటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ యూటర్న్ తీసుకుని ఆడినా.. మనకు పోటీ ఇవ్వలేదు. ఆసియా కప్‌లో వరుసగా మూడుసార్లు ఓడించాం. వారిపై ఇండియాదే డామినేషన్’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నారు.