News October 3, 2024

నిరుద్యోగులకు ALERT.. నేడు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభం

image

యువత కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ‘PM INTERNSHIP’ పథకానికి సంబంధించిన పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది. 21-24 ఏళ్ల నిరుద్యోగులు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. వారి విద్యార్హత, ఆసక్తి ఉన్న రంగాలను బట్టి టాప్-500 కంపెనీలలో 12 నెలల ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. నైపుణ్య శిక్షణతోపాటు ఒకేసారి రూ.6,000, ప్రతి నెలా రూ.5,000 అలవెన్సును అందజేస్తుంది.

Similar News

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 14, 2026

ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

image

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.

News March 14, 2026

ఈరోజు నమాజ్ వేళలు (14-3-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.