News October 3, 2024

పేదలపై సీఎం రేవంత్ ప్రతాపం: కిషన్ రెడ్డి

image

TG: ప్రజల ఆవేదన, మనోవేదనను అర్థం చేసుకుని కూల్చివేతలు ఆపాలని సీఎం రేవంత్‌కు లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పేదలపై రేవంత్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘డ్రైనేజీ సమస్య తీర్చకుండానే మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డ్రైనేజీ పైపులను మూసీలో కలుపుతున్నారు. కలుషితమైన నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 11, 2026

ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

News January 11, 2026

సారీ.. ఆ మెయిల్స్‌ను పట్టించుకోవద్దు: డేటా లీక్‌పై ఇన్‌స్టాగ్రామ్

image

యూజర్ల సెన్సిటివ్ <<18820981>>డేటా లీక్<<>> అయినట్లు వచ్చిన వార్తలను ఇన్‌స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్‌ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్‌స్టా ఖాతా సేఫ్‌గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.

News January 11, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.