News October 3, 2024
HYD: తోపుడు బండి, ఫుడ్ కోర్టు పెట్టారా..?మీకోసమే

✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.
Similar News
News March 7, 2026
HYD: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అలర్ట్.. వాళ్ల ఇళ్లు రద్దు !

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నా లేదా అద్దెకు ఇచ్చినా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు ఆ ఇళ్లను కేటాయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
News March 7, 2026
ఖాకీ కొలువుల కోసం DSNRలో భారీ ర్యాలీ!

పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు. సర్కారు కాలయాపన చేస్తే ఆక్రోశం తప్పదని ఆకాశ్, శంకర్ బృందం హెచ్చరించింది.
News March 7, 2026
HYD: అక్రమార్కుల ఆకలికి ‘కూలీ’ల బతుకు తెల్లారింది!

టోలిచౌకిలో బిల్డింగ్ గోవా కూలీ ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన సిటీలో కలకలం రేపింది. కేవలం 3 అంతస్తులకే పర్మిషన్ ఉంటే, 6వ అంతస్తు వరకు స్లాబ్‌లు వేశారు. DECలోనే నోటీసులిచ్చామని ఆఫీసర్లు బుకాయిస్తున్నారు. ఇస్తే పని ఎలా సాగింది? మామూళ్ల మత్తులో ఉన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.


