News October 3, 2024

ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి

image

TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.

Similar News

News October 28, 2025

అందుబాటులోకి ఎలాన్ మస్క్ ‘గ్రోకీపీడియా’

image

వికీపీడియాకి ప్రత్యామ్నాయంగా ‘X’ అధినేత ఎలాన్ మస్క్ ‘గ్రోకీపీడియా’ను తీసుకొచ్చారు. ‘ప్రస్తుతం 0.1 వెర్షన్ అందుబాటులో ఉంది. 1.0 వెర్షన్ దీనికి పదింతలు వేగంగా ఉంటుంది. ఈ 0.1 వెర్షన్ వికీపీడియాకంటే ఎంతో బెటర్‌గా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా దీనిలో సమాచారం దొరుకుతుందని చెబుతున్నారు. దీనిని ట్రై చేసిన కొందరు యూజర్లు ఎక్స్‌పీరియన్స్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News October 28, 2025

హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

image

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్​ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.

News October 28, 2025

బరితెగించారు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో

image

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఆయన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టారు. ఆయన ఓ మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లు AI వీడియోలు క్రియేట్ చేసి ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి CP సజ్జనార్‌ను కోరారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.