News October 3, 2024

కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్

image

మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, BRS రాజకీయాలు చేస్తున్నాయని CM రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. ఫాంహౌస్‌లు కూల్చుతామనే భయంతో పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 3, 2024

పడవ ప్రమాదం.. 60కి చేరిన మృతులు

image

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. దాదాపు 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ నైజీర్‌ నదిలో మునిగిపోయింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 160 మందిని రక్షించారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. పడవ పాతదని, ఎక్కువ మందిని ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా నైజర్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని, మృతులు పెరిగే అవకాశం ఉందన్నారు.

News October 3, 2024

తెలుగువారి కోసం Google కొత్త ఫీచర్

image

Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడ‌కం పెరుగుతుండ‌డంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాష‌లకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, త‌మిళం, మ‌లయాళం, బెంగాలీ, మ‌రాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

News October 3, 2024

సురేఖ‌పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

image

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.