News October 3, 2024
ఈ బ్యాగు ధర ఇంటి కన్నా ఎక్కువే.. తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను సేకరించడంలో నటాషా పూనావాలా ముందుంటారు. రీసెంటుగా పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆమె మోనోగ్రామ్ డ్రెస్‌లో మెరిశారు. ఇక ఆమె పట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్ అందర్నీ ఆకర్షించింది. అదే Louis Vuitton Maison de Famille బ్యాగ్. ఇంటిని తలపించే ఈ బ్యాగ్ ధర రూ.38 లక్షలు. పారిస్ శివారులోని Maison d’Asnieresకి ఇది మినియేచర్ వెర్షన్. ఈ ఇంటికి చాలా లెగసీ ఉందని తెలిసింది.
Similar News
News March 4, 2025
చికెన్ 65కు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

చికెన్ 65 రెసిపీకి చాలా క్రేజ్ ఉంది. కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని అందరికీ డౌట్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంఎం బుహారి అనే చెఫ్ చెన్నైలో ఓ రెస్టారెంట్ స్థాపించారు. అందులో బ్రిటీష్ వారికి సరికొత్త మాంసాహారం అందించేవారు. ఓ సైనికుడు భాష సమస్య కారణంగా మెనూ కార్డులో 65వ నంబర్‌లో ఉండే చికెన్ వంటకం తెమ్మనేవాడు. మిగతా కస్టమర్లు కూడా అలానే చెప్పేవారు. అది కాస్త చికెన్ 65గా స్థిరపడింది.
News March 4, 2025
సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News March 4, 2025
మార్చి 04: చరిత్రలో ఈ రోజు

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం